కడప అర్బన్ : నగరంలోని మరియాపురంలో ఉన్న పీస్ ఇస్లామిక్ ఇంటరే ్నషనల్ స్కూల్ విద్యార్థులు క్రీడల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శించి పతకాలు సాది óంచారని పీస్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సయ్యద్ గౌస్ పీర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ విద్యార్థులు కడప 5వ ఇంటర్ స్టేట్ తైక్వాండో ఛాంపియన్ షిప్ ఈనెల 21,22 తేదీలలో శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, తిరుపతి లో నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపాలని పేర్కొ న్నారు. ఐదవ తరగతి చదువుతున్న షేక్. నూర్ బాషా, షేక్. ఇబ్రహీం గోల్డ్ మెడల్స్, యన్. సురేంద్రకుమార్ సిల్వర్ మెడల్ సాధించారని చెప్పారు. డిసెంబర్ 9, 10 తేదీలలో బెంగుళూరులో నిర్వహించే జాతీయ స్థాయిలో నిర్వహించబోయే పోటీలో పాల్గొని మంచి బహుమతులు అందుకోవాలని ఆశిస్తునట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు స్పోర్ట్స్‌లో కూడా మంచి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధించాలని ఆకాక్షించారు.










