Nov 10,2023 23:17

పీఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

పీఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ ప్రారంభం
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
పీఎంజే జ్యువెలరీస్‌ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ ను తిరుపతి కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ శిరీష శుక్రవారం ప్రారంభించారు. స్థానిక లక్ష్మీపురం సర్కిల్‌ వద్దనున్న పిఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌ వద్ద జ్యోతి ప్రజ్వలనంతో ప్రదర్శన ప్రారంభించారు. అందులో ఏర్పాటు చేసిన ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఎంజే బిజినెస్‌ హెడ్‌ రామ్‌ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో ధన త్రయోదశి పురస్కరించుకొని, నవంబర్‌ 11, 12 తేదీల్లో రెండు రోజులు పాటు పీఎంజే జ్యువెలర్స్‌ ప్రదర్శన, అమ్మకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ హీరో మహేష్‌ బాబు కుమార్తె సితార అంబాసిడర్‌ గా ఉన్న సితార కలెక్షన్‌ ను ఇక్కడ అందుబాటులో ఉంచామన్నారు. సరికొత్త డిజైన్లతో మహిళలను ఆకర్షించే ఆభరణాలను ప్రదర్శనలో విక్రయానికి ఏర్పాటు చేశామన్నారు. రెండు లక్షలు పైగా కొనుగోలు చేసిన వారికి గోల్డ్‌ కాయిన్‌ ఉచితంగా అందజేస్తామన్నారు. ఎగ్జిబిషన్‌ సందర్భంగా ప్రత్యేకంగా 11 ప్లస్‌ 1 స్కీమును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. పి ఎం జె ఏర్పాటు చేసిన స్కీమును ఇక్కడ అందుబాటులో ఉంచామని, ఈ స్కీమ్‌ ద్వారా 75శాతం నగదు కట్టిన వినియోగదారులకు, యాజమాన్యం మరో 25శాతం నగదును వ్యయం చేసీ నాణ్యమైన ఆభరణాలను అందిస్తుందన్నారు. 15వేల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలు విలువచేసే ఆభరణాలను అందుబాటులో ఉంచామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సేల్స్‌ మేనేజర్‌ సోమశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.