పీడిత ప్రజల పోరాట యోధులు మాకినేని బసవపున్నయ్య, సప్దర్ హస్మి : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకురు
కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం ప్రగతి కోసం నినదించిన రచయిత దర్శకుడు వీధి నాటకం పోరాటస్ఫూర్తిగా చైతన్య దీప్తిగా మరిచిన అమూల్యమైన ప్రజా కళాకారుడు 35 ఏళ్ల వయసులో అమరుడైన ఎర్రజెండా ముద్దుబిడ్డ సప్దర్ హస్మి, పీడిత ప్రజల సమస్యలు పరిష్కారం కొరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులు మాకినేని బసవపునయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు కే.జే చంద్రశేఖర్ లో అన్నారు. బుధవారం పట్టణంలోని డాక్టర్ ఏ.ధనుంజయ మీటింగ్ హాల్ నందు సప్దర్ హస్మి 69వ జయంతి, మాకినేని బసవపున్నయ్య 31వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, ప్రజానాట్యమండలి సీనియర్ కళాకారులు కేజే చంద్రశేఖర్, డాల్ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి తరం కమ్యూనిస్టు ఉద్యమ నేత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు గొప్ప మార్సిస్టు సిద్ధాంత నేత బసవ పున్నయ్య అని మార్క్సిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం అవిశ్రాతంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు సుందరయ్య లాంటి నాయకులతో కలిసి పని చేయడం జరిగిందని భారత దేశంలో విప్లవ సాధనకు అనుసరించాల్సిన వ్యూహం గురించి పార్టీలో చర్చించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో రెండుసార్లు జైల్లో కూడా పెట్టడం జరిగిందన్నారు. కావున నేటితరం పోరాటాలకు నేను బసవపున్నయ్య, సప్దర్ హస్మి లజీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నరసింహ నాయక్, మండల నాయకులు పి సుధాకర్, మా భాష, పట్టణ నాయకులు ఎన్.స్వాములు, డి రామ్ నాయక్,ఏ.సురేంద్ర, షేక్ ఇస్మాయిల్, గణపతి తదితరులు పాల్గొన్నారు.










