Feb 23,2023 00:28

దగ్ధమైన యంత్రం

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:మండలంలోని కొరుప్రోలు గ్రామంలోని పీచు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారు సుమారు ఒంటి గంట సమయంలో శ్రీ శ్రీనివాసా క్వాయర్‌ ఇండిస్టీలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పీచు బేళ్ళు కట్టే యంత్రం పూర్తిగా దగ్ధమయింది. యలమంచిలి అగ్నిమాపక అధికారి డి.రాంబాబు, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది యం.రాజశేఖర్‌, జి.రాము, ఏ రామారావు, యం. అప్పారావులు ఏడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు నలభై లక్షల ఆస్థి నష్టం వాటిల్లినట్లు పిన్నంరాజు సత్యన్నారాయణరాజు తెలిపారు.