May 04,2023 00:33

రికార్డులు తనిఖీ చేస్తున్న డిఎం అండ్‌ హెచ్‌ఒ

ప్రజాశక్తి-గొలుగొండ:స్థానిక పిహెచ్‌సిని బుధవారం డిఎంఅండ్‌హెచ్‌ఒ హేమంత్‌కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పిహెచ్‌సినిలో చేపట్టిన నాడు నేడు పనులను పరిశీలించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేసి మందులు స్టాకును పరిశీలించారు. పిహెచ్‌సి పరిధిలో ఉన్న సబ్‌ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్న తీరును సమీక్షించారు. పిహెచ్‌సి ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తేదీన చేపట్టే గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలపై వైద్యాధికారుల నుండి వివరాలు సేకరించారు. రక్తహీనత కలిగిన వారికి అందించే వైద్య సేవలపై ఆరా తీశారు. గ్రామాల్లో కిషోర్‌ బాలికలకు, గర్భిణీ, బాలింతలకు ఆరోగ్య విద్యపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శ్యామ్‌కుమార్‌, అశ్విని శైలజా పాల్గొన్నారు.