పరీక్షలు చేస్తున్న వైద్యులు
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని కిల్లోగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐటిడిఏ ఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. సుమారు 150 మంది గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని కె.కరుణ మాట్లాడుతూ. గర్భిణులు ఆకుకూరలు, గుడ్లు, పాలతో పాటు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఆశ కార్యర్తలు రక్తహీనత మాత్రలను ఇవ్వడంతో పాటు ప్రతినెల పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రసవ సమయంలో దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.










