
ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
లంకలకోడేరు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పూలపల్లి సచివాలయం వద్ద జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్ క్యాంపును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవల, ఓపిల నమోదుపై డాక్టర్ లీనా సుప్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి యువిన్ యాప్ ద్వారా నమోదు చేసే కార్యక్రమాన్ని అడిగి తెలుసుకున్నారు. సిడి ఎన్‌సిడి కార్యక్రమంలో నమోదు తక్కువగా ఉందని దాన్ని వెంటనే ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు, సూపర్‌వైజర్ డి.కమల, ఎంఎల్‌హెచ్‌పిలు కృష్ణవేణి, శ్రావణి, ఎఎన్‌ఎం.విజయశాంతి, హెల్త్ అసిస్టెంట్ ఏసునాదం, డిఇఒ సురేష్, సింగ్, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.