Jul 01,2023 21:30

కార్య క్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.రోగులను పరీక్షిస్తున్న డిఎంహెచ్‌ఒ కొండయ్య

కలకడ : మండలంలోని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దేవలపల్లి సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎం హెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. దేవలపల్లి సచివాలయంలో హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్‌లో రికార్డులు, రిపోర్టులు, మందులను తనిఖీ చేశారు. ఎల్‌సిడిసి సర్వే, వ్యాధి నిరోధక టీకాలు, మూడవ విడత వైఎస్‌ఆర్‌ కంటివెలుగు రికార్డులు పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు, యాభైసంవత్సరాలు పైబడిన వారికి హెచ్‌బి లెవెల్స్‌ మాన్యువల్‌ మెథడ్‌లో చేయాలని సూచిం చారు. వైద్యులు కిషోర్‌కుమార్‌రెడ్డి, జవహర్‌ బాబులతో మాట్లాడుతూ ఫార్మసీల్యాబ్‌, వ్యాక్సిన్‌గది రికార్డులను పరిశీ లించారు. విస్తరణ అధికారి జి.జయ రామయ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రికార్డులను అడిగి తెలుసు కున్నారు. జిల్లా అధికారి డాక్టర్‌ కొండయ్య వెంట జిల్లా సర్వే లైన్స్‌ అధికారి డాక్టర్‌.రియాజ్‌ బేగ్‌, డిఎన్‌ఎంఒ డాక్టర్‌ విష్ణువర్ధన్‌, హెల్త్‌ ఎడ్యు కేటర్‌ బలరామరాజు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఇఒజి జయ రామయ్య. పిఎంఒఒ పరశురామ్‌, సూప ర్వౖజర్‌ ముజీబ్‌బాషా, బి.రెడ్డ మ్మ. ఫార్మసిస్టు షేక్‌ షరీఫ్‌, ల్యాబ్‌ టెక్నీ షియన్‌ జమీల్‌ అహ్మద్‌, ఆరోగ్య కార్యకర్తలు ఎస్‌వి రమణమ్మ. డి.వరలక్ష్మి. ఎంఎల్‌హెచ్‌పి రాజ సులోచన, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నందలూరు పిహెచ్‌సిలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ..
నందలూరు : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ చెన్నకష్ణ శనివారం ఆకస్మిక ంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. వైద్యశాలకు వస్తున్న రోగులకు వైద్య సిబ్బంది సరైన వైద్యం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసు కున్నారు. అనంతరం డాక్టర్స్‌ డే సందర్భంగా డాక్టర్‌ సజన, డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డిలను రాష్ట్ర సిహెచ్‌ఒల అధ్యక్షులు మాజీ సిహెచ్‌ఒ పిల్లి పిచ్చయ్య ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి కేక్‌కట్‌ చేశారు.