Sep 20,2023 23:55

ప్రజాశక్తి - భట్టిప్రోలు
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం పిహెచ్‌సిలో బుధవారం జరిగింది. అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీపీ డివి లలిత కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైద్యశాల రెండవ వైద్యులు శ్రీనివాసరావు నిరంతరం గైన్ గైర్హాజరవుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం అంటూ వ్యాధులు ప్రబలే సమయంలో గైర్హాజరైతే రోగులు ఇబ్బందులు పడతారని  తెలిపారు. తక్షణమే ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. వైద్యశాలకు అవసరమైన కొన్ని రకాల సౌకర్యాల ఏర్పాటుకు పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ వైద్యులు డిఎల్ పద్మజ, కమిటీ సభ్యులు తాసిల్దార్ డి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో గుమ్మా చంద్రశేఖర్, భట్టిప్రోలు సర్పంచి దారా రవికరణ్మయి, సూరేపల్లి సర్పంచ్ మార్ల విజయలక్ష్మి, జడ్పిటిసి ఉదయభాస్కరి, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ ఉన్నారు.