ప్రజాశక్తి - భీమడోలు
పిహెచ్‌సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ పథకపు సేవలను వినియోగించుకోవాలని పూళ్ళ పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ కళ్యాణ మహేశ్వరి కోరారు. భీమడోలులో గురువారం పర్యటించిన పిహెచ్‌సి వైద్యులు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలకు చెందిన పిల్లలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఆ తర్వాత ఇంటింటికీ వెళ్లి గర్భిణీలు, బాలింతలతో పాటు ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందిన రోగులను పరీక్షించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 14 మంది గర్భిణీలు, ఒక బాలింత, షుగర్, బిపి, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 115 మంది రోగులను పరీక్షించారు. సాధారణ జ్వరాలతో ఇబ్బందిపడుతున్న ఆరుగురికి చికిత్స చేసి మందులను పంపిణీ చేశారు. ఇదేక్రమంలో భీమడోలుకు చెందిన హెల్త్ క్లీనిక్ నెంబర్-1 ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఫ్రైడే డ్రైడే' కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్ ఇఒ కిషోర్, హెల్త్ క్లీనిక్ సిబ్బంది మురళి, చంద్రకళ పాల్గొన్నారు.










