కడప ప్రతినిధి : పిహెచ్‌సి పోస్టుల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. స్థానిక డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో రీజనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రెండ్రో జులుగా 143 జిఒ అమలులో భాగంగా జోన్-4 పరిధిలోని ఉమ్మడి కడప, చిత్తూరు, కర్నూలు, అనం తపురం, జిల్లాలోని 630 పిహెచ్‌సిల్లో 14 మంది ఉద్యోగుల నియామకం ప్రకారం కౌన్సెలింగ్ చేపడు తున్న సంగతి తెలిసిందే. రెండోరోజైన శుక్రవారం సాయంత్రం 220 సిహెచ్‌ఒ, ఎంపిహెచ్‌ఇఒ పోస్టుల రేషియో అమలు అంశంపై గందరగోళం నెలకొంది. ఒక సిహెచ్‌ఒతోపాటు ఇద్దరు ఎంప ిహెచ్‌ఇఒలను రేషియో కౌన్సిలింగ్ పిలవాల్సిన నేప థ్యంలో కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే సిహెచ్‌ఒలను ఆప్షన్స్ నిర్ధారించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మొదటి ఆప్షన్ అమలు చేయడంతో సీనియర్లు అయిన సిహెచ్‌సిలకే ప్రాధాన్య పోస్టులు లభించే అవకాశం ఉందని, మిగిలిన అప్రధ్యాన్య పోస్టులకు ఎంపిహె చ్‌ఇఒలను పరిమితం చేయడం పట్ల వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఎంపిహెచ్‌ఇఒలు, సిహెచ్‌సి తమ పంతమే నెగ్గాలనే ధోరణితో పరస్పరం భారు కాట్‌లు చేసుకోవడం ఉత్కంఠను కలిగించింది. ఆర్‌డి రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారిని సం ప్రదించడంతో వారి సలహా మేరకు సిహెచ్‌ఒలకు ప్రాధాన్యత ఇచ్చి కౌన్సెలింగ్ కొనసాగించారు. చేసేదేమీ లేకపోవడంతో మిగిలిన అప్రధాన్య పోస్టులకు సిహెచ్‌సి, ఇద్దరు ఎంపిహెచ్‌ఇఒలు కౌన్సిలింగ్‌కు హాజరు కావడం గమనార్హం. సహజంగానే సిహెచ్‌ఒలు సీనియర్లు ఉండడం అందరికీ తెలిసిందే. సీనియారిటీ ప్రాతిపదికన సిహె చ్‌ఒలను పిలిచి ఎక్కడికి వెళ్తారని అడిగిన తర్వాత కౌన్సెలింగ్ కొనసాగించారు. రెండవ రోజు కౌన్సి లింగ్ సమయంలో కూడా వేకెన్సీ పోస్టుల జాబితాలను వెల్లడించ కుండానే, అప్పటికప్పుడు వేకెన్సీలను చూసుకుని కౌన్సిలింగ్ నిర్వహించ డమేమిటనే అంశం చర్చనీయాంశమైంది.










