ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: మండలంలోని కిలగాడ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి (పిహెచ్‌సి) నూతన భవనాన్ని విశాఖ ఉమ్మడి జిల్లా చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ట్రైకాకర్ డైరెక్టర్ శతకం బుల్లిబాబు ప్రారంభించారు. అనంతరం స్థానిక సర్పంచ్ శివశంకర్ మాట్లాడుతూ మాట్లాడుతు, పీహెచ్సీ భవనాన్ని నూతనంగా నిర్మించడం ఆనందదాయకంగా ఉందన్నారు.భవనం నిర్మాణం చేపట్టడంతో రోగులకు సంపూర్ణ వైద్య చికిత్సలు అందే అవకాశాలు ఉన్నాయన్నారు. బంగరుమెట్ట, దారేల, వనభసింగి, పెడగుడ, ఏనుగురాయి, జర్రెల, పరెడ గ్రామ పంచాయతీల ప్రజలు వైద్య సేవలను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఆసుపత్రి నిర్మాణంకు భూమి దానం చేసిన కుటుంబానికి సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూదానం చేసిన కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో కిరణ్ కుమార్, ఎస్సై రవీంద్ర, కిలగడ పీహెచ్ వైద్యాధికారి రమేష్, వైస్ సర్పంచ్ వి జగన్నాదం, వార్డు సభ్యలు బొంజుబాబు, పరంజ్యోతి, శ్రీను, వైసీపీ మండల నాయకులు, గ్రామ వాలంటరీలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










