సన్మానిస్తున్న దృశ్యం
పిఎసిఎస్ చైర్మన్‌గా 'రామిశెట్టి'
ప్రజాశక్తి-సీతారామపురం:మారం రెడ్డి పల్లి పిఎసిఎస్ చైర్మన్‌గా రామిశెట్టి తిరుపతయ్య గురువారం స్థానిక సొసైటీ కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. డైరెక్టర్లుగా గుండ్ల పల్లి తిరుపాలు, తలసాని రమణయ్యలు బాధ్యతలు చేపట్టారు. వీరికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సొసైటీ అధ్యక్షుడు రామిశెట్టి తిరుపతయ్య మాట్లాడారు. మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిలా ఆదేశాలను అనుసరిస్తూ మండలంలోని పెద్దల సూచనలను పాటిస్తూ రైతాంగానికి ప్రభుత్వం నుంచి తగిన సేవలను చేస్తానన్నారు. అత్యంత వెనుకబడిన మెట్ట ప్రాంతమైన మండలం లోని రైతుల అభివద్ధికి దోహదపడతానని రైతుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి కోఆప్షన్ నెంబర్ తాజుద్దీన్, వైసీపీ మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి, సర్పంచ్ చింతనబోయిన దుర్గయ్య యాదవ్, సొసైటీ సిఇఒ శ్రీనివాసులు, నాయకులు రామ్మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, బక్కా చిన్న కొండయ్య పాల్గొన్నారు.










