
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యా యులకు పిఎఫ్ సొమ్మును ఇప్పిం చాలని ఎపిటిఎఫ్ ప్రతినిధి బృందం కమిషనర్ దినేష్‌కుమార్‌ను కోరింది. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదు ర్కొంటున్న సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని శుక్రవారం ఆయనకు అందించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎ.ఉదయబ్రహ్మం మాట్లాడుతూ ఇప్పటి వరకూ నగరపాలక సంస్థ ఆధ్యర్యంలో పనిచేసిన ఉపాధ్యాయులు విద్యాశాఖ పరిధిలోనికి వెళ్లారని తెలిపారు. నగరపాలక సంస్థ అద్వర్యంలో వినియోగంలో ఉన్న ఉపాధ్యాయుల పిఎఫ్ ఖాతాలను రద్దు చేసి ఆ సొమ్ముని ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కెవివి.సత్యనారాయణ, రాష్ట్ర మాజీ కార్యదర్శి వఝల అప్పయ్య శాస్త్రి, మండల శాఖ అధ్యక్షులు డేవిడ్ లివింగ్ స్టన్, జిఎస్‌ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.