Mar 27,2023 22:54

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: వివిధ సంస్థలలో పనిచేసే సిబ్బంది పిఎఫ్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అలాగే పిఎఫ్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చని ఎన్‌టిఆర్‌ జిల్లా పిఎఫ్‌ నోడల్‌ అధికారి పి.జవహర్‌లాల్‌ అన్నారు. ప్రతి నెలా జిల్లా కేంద్రాలలో నిధి ఆప్కే నికట్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎనికేపాడులోని ఎస్‌ఆర్‌కె ఇంజనీరింగ్‌ కళాశాలలో పిఎఫ్‌పై అవగాహణా సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కార్మికులు, వివిధ సమస్యల యజమానులతో ప్రత్యేకంగా అధికారులు సమావేశం నిర్వహించారు. పిఎఫ్‌కు సంబంధించిన పలు సూచనలు అందించడంతో పాటు ఎవరికైనా ఎటువంటి సమస్యవ వచ్చినా వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే పులువరు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వెంటనే పరిష్కరించారు. ఈకార్యక్రమంలో పిఎఫ్‌ కమీషనర్‌ -2 ఎన్‌.శ్రీకాంతరెడ్డి పర్యవేక్షించగా, పిఎఫ్‌ ఆఫీసు సిబ్బంది శ్రీనివాసరావు, శివశంకర్‌, శ్రీధర్‌ రెడ్డి, తులసీ, పాల్గొన్నారు.