
ప్రజాశక్తి- అనకాపల్లి
జిల్లాలో మునగపాక మండలం రాజుపేట ఇండియా ఫుడ్ జీడి పిక్కల కంపెనీ కార్మికులకు పీఎఫ్ మంజూరు చేయడంలో జాప్యాన్ని అరికట్టాలని కోరుతూ గురువారం అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేర్లు, వయసు తదితర నమోదులో జరిగిన పొరపాట్లు సరిచేసి తమకు రావాల్సిన పిఎఫ్ ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీడిపిక్కల కంపెనీ యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్ము తక్షణమే చెల్లించాలన్నారు. కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పిఎఫ్ ఆదాలకు హాజరైన అధికారులకు సమస్యలతో కూడిన వినత పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మునగపాక మండల నాయకులు ఆళ్ళ మహేశ్వరరావు, ఎస్ బ్రహ్మాజీ, మహాలక్ష్మి, రమణమ్మ అరుణ తదితరులు పాల్గొన్నారు.