ప్రజాశక్తి-కాకినాడ ఎపిఆర్‌పిఎ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు ఆధ్వర్యంలో ఇపిఎఫ్ పెన్షనర్ల సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్నాథపురం రైస్ మిల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పోస్ట్ కార్డులు పంపించారు. వార్ఫ్ రోడ్డులోని బ్రాంచ్ పోస్ట్ కార్యాలయంలో వీటిని పోస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 50 వేల కార్డులు పోస్ట్ చేసినట్టు సత్తిరాజు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెపి.నాగేశ్వరావు కార్యదర్శి పి.రమణ, సభ్యులు పాల్గొన్నారు.










