బొలెరో వాహనాన్ని ప్రారంభిస్తున్న జెసి, పిఒ
ప్రజాశక్తి-పాడేరు:ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ జె.శివ శ్రీనివాసు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏ ఆవరణలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో జెసి, పిఒ, శిక్షణ కలెక్టర్ బొలెరో రవాణా వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి, పిఒ మాట్లాడుతూ, ఈ పధకం కింద 35 శాతం సబ్సిడీ ఉంటుందని, మిగిలిన 65 శాతం ఋణం పొంది వాయిదాలలో చెల్లించ వచ్చని వివరించారు.ఖాళీ సమయంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్ ధన్ మార్టులకు కూడా సరుకులు రవాణా చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డిఆర్‌ఓ పి.అంబేద్కర్, డిఆర్డిఎ పిడి మురళి తదితరులు పాల్గొన్నారు.










