Sep 01,2023 00:46

పిడుగురాళ్ల: పట్టణంలోని చెరువును అభివృద్ధి చేసేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రూ.11 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అj్యయని గుర జాల శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి అన్నారు గురు వారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అజెండాలోని అంశాలను కౌన్సిల్‌ సభ్యులకు చదివి వినిపించారు అజెండాలోని అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 120 పట్టణాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం పిడుగురాళ్ల అని కోట్ల రూపాయల నిధులతో పట్టణాన్ని అభివద్ధి చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని చెరువు నందు వాకింగ్‌ ట్రాక్‌,పార్కు ఏర్పాటు చేయబోతున్నామని త్వరలోనే టెండర్లు ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. .గతంలో చెరువు భూమి ఎంతో ఉండేదని కాలక్రమేణా ఆక్రమించుకుంటూ పోతున్నారని, అందుకే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువు భూమి ఆక్రమణలు దొరక్కుండా ప్రహరీ గోడలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం పిడుగురాళ్లలో కొద్దిపాటి భూగర్భ జల సమస్య ఉందని భవిష్యత్తులో ఈ సమస్య మరింత జటిలం కాకుండా ఉండేందుకు చెరువును బాగు చేసుకోవాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ సుబ్బారావు,వైస్‌ చైర్మన్‌ కొమ్ము ముక్కంటి,జయాలుద్దీన్‌,మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు,కో ఆప్షన్‌ నెంబర్లు,సచివాలయ సిబ్బంది,మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.