మృతి చెందిన పశువులు
ప్రజాశక్తి- అరకులోయ :మండలంలోని పద్మాపురం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై రెండు దుక్కి పశువులు మృతి చెందాయి. ఎప్పటిలాగానే దుక్కి పశువులను మేపడానికి ప్రధాని పుట్టు గ్రామ సమీపంలో తీసుకుని వెళ్లారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగు పడి పద్మాపురం గ్రామానికి చెందిన స్వాభి అప్పలనాయుడు, కిల్లో గురులకు చెందిన రెండు పశువులు మృతి చెందాయి. పశువుల కాపరులు ప్రాణాలు దక్కించుకున్నారు.పద్మాపురం పంచాయతీ సర్పంచ్ పెట్టేది సుస్మిత, ఉప సర్పంచ్ భగత్ రామ్, ఎంపీటీసీ, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు శుక్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గిరిజన రైతులను ఆదుకోవాలని వారు అధికారులను కోరారు.










