చనిపోయిన జీవాలను పరిశీలిస్తున్న టిడిపి నాయకులు మెట్టు శ్రీనివాసరెడ్డి తదితరులు
ప్రజాశక్తి-పెద్దారవీడు: మండలంలోని శుక్రవారం రాత్రి పెనుగాలులు వీయడంతోపాటు పిడుగులు పడ్డాయి. ఈ క్రమంలో మండలంలోని కర్రోల గ్రామంలో పిడుగుపడి కోనంగి పాలంకయ్యకు చెందిన 19 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. గొర్రెల ఖరీదు సుమారు రూ.3 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ కన్వీనర్ గొట్టం శ్రీనివాసరెడ్డి, గుమ్మ గంగరాజు, పెద్దారవీడు మండల మాజీ జడ్‌పిటిసి జడ్డా రవిలు బాధితుడ్ని పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.










