సపర్యలు చేస్తున్న కుటుంబీకులు
ప్రజాశక్తి-డుంబ్రిగూడ: మండలంలో బుధవారం మధ్యాహ్నం భారీ పిడుగుల శబ్దాలతో కూడిన భారీ కారణంగా ఓ గిరిజన యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. మండలంలో బుధవారం మధ్యాహ్నం భారీ పిడుగుల వర్షం కురిసింది. ఆ సమయంలో పశువుల మేతకు తీసుకెళ్లిన ఖండ్రుమ్ పంచాయతీ ఉజ్జంగి గ్రామంలోని పాంగి జోయో (28) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు దొంబుకు తీవ్ర గాయలై పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్‌లో అరకులోయ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.










