Jun 13,2023 23:25

సంఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ అప్పలరాజు

ప్రజాశక్తి-అడ్డతీగల
పిడుగు పాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఎల్లవరం పంచాయతీ బొంగరాలు పాడు గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... బొంగరాలు పాడు గ్రామానికి చెందిన నర్సి అప్పారావు సోమవారం సాయంత్రం తన పొలంలోకి వెళ్లి పని చేసుకుంటున్న సమయంలో వర్షం ప్రారంభమైంది. దీంతో ఆయన చెట్టు కిందకు వెళ్లారు. ఈ సమయంలో పిడుగు పడటంతో అక్కడే మృతి చెందాడు. సోమవారం రాత్రంతా ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలంలోకి వెళ్ళగా అప్పారావు మృతి చెంది ఉండడంతో బోరున విలపించారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులు మండల స్థాయి అధికారులకు, పోలీసులకు తెలియజేశారు. ఎస్సై అప్పలరాజు, వీఆర్వో మురళీకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పలరాజు తెలిపారు. మృతుడు అప్పారావుకు భార్య చిన్ని, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు బంధువులు చెప్పారు.