Mar 03,2023 16:08

పిడిఎఫ్‌ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న సిఐటియు నాయకులు

పిడిఎఫ్‌ మద్దతుదారులను గెలిపించండి
సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. యేసు రత్నం

ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ పోతుల నాగరాజుకు ఓటు వేసి గెలిపించాలని సుండిపెంట కాలనీలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నము, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. రఘు రాముడు యాదవ్‌, సిఐటియు శ్రీశైలం మండల కార్యదర్శి చిన్న మారెన్న, సిఐటియు నాయకులు మల్లికార్జున, నాగ సైదయ్య ప్రచారం చేశారు. సుండిపెంట ప్రభుత్వ పాఠశాల, పాలిటెక్నిక్‌, ఐటిడిఏ కార్యాలయము, డిగ్రీ కళాశాల, ఫారెస్ట్‌ ఆఫీసు,ఇరిగేషన్‌ శాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని కోరారు. నిరంతర ప్రజా ఉద్యమాలను బలపరుస్తూ వాటిలో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉద్యోగులకు, నిరుద్యోగు లకు, కార్మికులకు ప్రభుత్వం చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా గలము విప్పి మాట్లాడే నాయకుడు పోతుల నాగరాజు అన్నారు. 198 ప్రజాసంఘాల మద్దతు తెలిపిన పోతుల పిడిఎఫ్‌ అభ్యర్థి పోటీ బరిలో ఉన్నారని, నిజాయితీగా పనిచేసే నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. జి. మల్లికార్జున, గాలయ్య, పో లయ్య, నాగ వెంకటేశ్వర్లు, చిన్న ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎపి వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు, మండల అధ్యక్షులు నరేష్‌, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు సంపత్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని పాత మాడుగుల గ్రామంలో పోతుల నాగరాజుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వ్యకాసం నాయకులు అశోక్‌, నరసింహ, దేవకుమార్‌ పాల్గొన్నారు. బేతంచెర్ల : ప్రజా సమస్యలపై చట్టసభల్లో పాలక ప్రభుత్వాలను ప్రశ్నించే వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకుందాం అని సిఐటియు జిల్లా నాయకులు వై ఎల్లయ్య, వైబి వెంకటేశ్వర్లు, జి శేబారాణి అన్నారు. మండల కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయం ఆర్‌ ఈశ్వరయ్య, బాలయ్య అధ్యక్షతన కార్మిక, ప్రజాసంఘాల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించే విధంగా కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు షేభారాణి, సిఐటియు మండల కార్యదర్శి రహంతుల్లా, పట్టణ కార్యదర్శి సంజీవ నాయుడు, నాగేంద్రమ్మ, ఫాతిమా, బి నాగలక్ష్మి, వెంకటరమణ, చిన్న వెంకటేశ్వర్లు, కార్మికులు పాల్గొన్నారు. ప్యాపిలి : ప్రజా సమస్యలపై చట్టసభలు ల్లో మాట్లాడే అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని సీఐటీయూ మండల కార్యదర్శి చిన్న రహిమాన్‌, శ్రీనివాసులు, ఇలియాజ్‌ అన్నారు. పట్టణ కేంద్రం, మండలంలోని వెంగ ళంపల్లి, ఎన్‌ రంగాపురం,ఓబుల దేవరపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో గుర్రప్ప, రాముడు, భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. వెలుగోడు : పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ పోతుల నాగరాజు గెలుపుకై కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రామదాసు మండలంలోని మాధవరం గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఆత్మకూరు : ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను గెలిపించాలని డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు ఏ రణధీర్‌, ఎపి రైతు సంఘం మండల అధ్యక్షులు మా బాషలు కోరారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేట్‌ స్కూల్స్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాములపాడు: సమాజ సేవా గుణం కలిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు సామన్న, హనుమంతు, మహమ్మద్‌ గని, ఈశ్వర్‌లు ఎమ్మెల్సీ ఓటర్లను అభ్యర్థించారు. పెద్దల సభలో ప్రజావాణి వినిపించే సత్తా కలిగిన వ్యక్తి నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.