ప్రజాశక్తి- యంత్రాంగం
పెందుర్తి : పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభను గెలిపించాలని కోరుతూ జివిఎంసి 93, 94 వార్డుల పరిధిలోని పలు సచివాలయాలలో ప్రజా సంఘాల నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగన్ మాట్లాడుతూ, శాసనమండలిలో నిరుద్యోగులు గొంతు వినిపించేది పిడిఎఫ్ నాయకులేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి, జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు.
మధురవాడ : పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ, కొమ్మాది, కార్పెంటర్ కాలనీ, వికలాంగుల కాలనీ, రాజీవ్‌గృహకల్ప, స్వయంకృషినగర్ ప్రాంతాల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు డి.అప్పలరాజు, మాట్లాడుతూ, మార్చి 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు డి.కొండమ్మ, సిహెచ్ శేషు, ఎస్.రామప్పడు. డివైఎఫ్‌ఐ నాయకులు వై.రాము, కెవిపిఎస్ నాయకులు జికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : శ్రీనగర్, అరుణోదయ కాలనీ, సుందరయ్య కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనిత, సిఐటియు నాయకులు రాంబాబు, కృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భీమునిపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ సిఐటియు నాయకులు సోమవారం తగరపువలసలో ప్రచారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్ శ్రీనివాసవర్మ, సోమి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం:ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పిడిఎఫ్, 250 ప్రజా సంఘాలు బలపర్చిన అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సోమవారం కొండకర్ల గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పట్టబద్రులను కలిశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము బుద్ధ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
హరిపాలెంలో ప్రచారం
కోరెడ్ల రమాప్రభకు మద్దతుగా సోమవారం సాయంత్రం ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కె రామ సదాశివరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ ఎం సూర్య రామకుమార్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రతినిధి ఎస్ కనుమ నాయుడు తదితరులు మండలంలోని హరిపాలెం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు.
డుంబ్రిగూడ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ మండలంలోని అరకు సంత బయలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో గిరిజన సంఘం నాయకులు సోమవారం కరపత్రాలను పంచుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులు, ఇతర పట్టభద్రులను కలిసి, రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి సూర్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి, మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగావకాశాలు, ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి చట్టసభల్లో ఈ ప్రాంత ప్రజల వాణిని వినిపించాలంటే, సమస్యలపై అవగాహన, పోరాటతత్వం ఉన్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ వంటి వారిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యావంతులైన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటర్లంతా విజ్ఞతతో రమాప్రభకు ఓటేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగులు, మేథావులు, 250కుపైగా ప్రజాసంఘాలు బలపర్చిన అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాపభను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం అందరిపై ఉందని ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో గిరిజన సంఘం నాయకులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










