Mar 07,2023 19:30

ప్రచారం చేసున్న ప్రజా సంఘాల నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకుందాం
ప్రజా సంఘాల నాయకులు విస్తృత ప్రచారం

ప్రజాశక్తి - ఆత్మకూరు

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు రణధీర్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి రామ్‌ నాయక్‌, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ నాయక్‌, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, రైతు సంఘం మండల అధ్యక్షులు మా బాష, ఉపాధ్యాయ, పట్టభద్రులను కోరారు. పట్టణంలో ఇంటింటికి, ఎంఆర్‌సి, ఆదిత్య స్కూల్‌లో, ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో పిడిఎఫ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
కొత్తపల్లి : సమస్యలు పరిష్కారం కావాలంటే పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపు అవసరమని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బొల్లు ప్రసాద్‌ యాదవ్‌, వ్యకాసం మండల నాయకులు చిన్న చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని ముసలమడుగు, శివపురం, లింగాపురం గ్రామాలలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. నందికొట్కూరు: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పోతుల నాగరాజును గెలిపించాలని ఏపీ రైతు సంఘం సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, సిఐటియు సీనియర్‌ నాయకులు ఎస్‌ ఉస్మాన్‌, సిఐటియు టౌన్‌ కార్యదర్శి నల్లబోతుల గోపాలకృష్ణ మాట్లాడారు. రైతు సంఘం నాయకులు ఎన్‌ కృష్ణయ్య, శ్రీనివాసులు, మౌలాలి, సిఐటియు భవన నిర్మాణ కార్మికులు ఎస్‌. మహబూబ్‌ బాషా, రామకృష్ణ, మధు బాబు, తిరుమలేష్‌ పాల్గొన్నారు. బేతంచర్ల: ప్రశ్నించే గొంతుకలైన ఉద్యమకారులను ఎమ్మెల్సీలుగా గెలిపించుకుందామని సిఐటియు జిల్లా నాయకులు వై ఎల్లయ్య, వైబి వెంకటేశ్వర్లు, వ్యకాసం జిల్లా నాయకులు ఆరు ఈశ్వరయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదరు అన్నారు. మండల పరిధిలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌ రహమతుల్లా, బి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి మల్లికార్జున, ఎర్రి గల సూరి తిమ్మయ్య, ఆంజనే యులు, నాగరాజు, ఏఐవైఎఫ్‌ మండల నాయకులు భాస్కర్‌, రామాంజనే యులు, తిమ్మయ్య, నరసింహ, నాగరాజు, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు రాజబాబు, వెంకటరమణ, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.