Mar 05,2023 21:20

పిడిఎఫ్‌ అభ్యర్థులను ఎమ్మెల్సీలు గా గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న జెవివి, యుటిఎఫ్‌ నేతలు

పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి
- జెవివి, యుటిఎఫ్‌ నేతలు
ప్రజాశక్తి - డోన్‌

    పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్‌ పోతుల నాగరాజుకి, టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్‌ రాహుల్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖాజా, యుటిఎఫ్‌ రాష్ట్ర మాజీ గౌరవాధ్యక్షులు ఎన్‌.నరసింహుడులు కోరారు. ఆదివారం డోన్‌ పట్టణం పాతపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులైన మేధావి వర్గం ఓటు వేసే ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్‌ పోతుల నాగరాజుకి 198 ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయంటే ఆయన ఉద్యమ నేపథ్యం, పోరాట పటిమ తెలుస్తుందన్నారు. పోతుల నాగరాజు ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని కూడా స్వచ్ఛందంగా వదులుకొని జీవితాన్ని ఉద్యమాలకు అంకితం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. మేధావులను, ఉన్నత విద్యావంతులను పెద్దల సభకు పంపాల్సిన ఈ ఎన్నికలలో కూడా వైసిపి, టిడిపి, బిజెపిలు ప్రలోభాలతో డబ్బు మూటలతో గెలవాలని పోటీలు పడుతున్నాయని అన్నారు. అటువంటి వారిని గెలిపించినా వారి సొంత ప్రయోజనాల కోసం, హంగు ఆర్భాటాలు, హౌదా కోసం చట్టసభలను ఉపయోగించుకుంటారు తప్ప ప్రజా సమస్యలపై ప్రశ్నించిన పాపానా పోవడం లేదన్నారు. వారిని గెలిపించినా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. చట్టసభల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తప్పు, ఒప్పులను గ్రహించి ధైర్యంగా రాజకీయాలకు అతీతంగా చెప్పగలిగే స్థాయి ఉండాలని, అది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. అటువంటి లక్షణాలన్నీ పిడిఎఫ్‌ అభ్యర్థులు నాగరాజుకి, కత్తి నరసింహారెడ్డికి ఉన్నాయని, విజ్ఞులైన ఓటర్లు వారిని చట్టసభలకు పంపాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివరాం, శ్రీకాంత్‌, రామాంజనేయులు, నాగరాజు, నాగమద్దయ్య, ఆవాజ్‌ నాయకుడు అక్బర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు విజరు, ఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ గౌడ్‌, నాయకులు మాణిక్యం, సుబ్బరాయుడు, బాబు, వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌ : పిడిఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, డాక్టర్‌ పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందామని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.యేసురత్నం, యుటిఎఫ్‌ నాయకులు బాలాజీ రావు, ఎస్‌టియు జిల్లా ఆర్థిక కార్యదర్శి శివ ప్రసాద్‌, నాయకులు బాలాజీ నాయక్‌, డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు ఏ.రణధీర్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి డి. రామ్‌ నాయక్‌లు కోరారు. పట్టణంలోని కిషన్‌ సింగ్‌ స్ట్రీట్‌, జిన్ను పుల్లయ్య వీధి, శ్రీరామ్‌ నగర్‌లలో ప్రచారం నిర్వహించారు. అలాగే మండలంలోని కరివేన, కురుకుంద గ్రామాల్లో గిరిజన సంఘం నాయకులు నరసింహనాయుడు, వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు మహబూబ్‌ బాషా తదితరులు ప్రచారం నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి, డాక్టర్‌ పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసనమండలి పంపించాలని విజ్ఞప్తి చేశారు. రుద్రవరం : ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రుద్రవరంలో ప్రచారం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు తలారి రామచంద్రుడు, శంకర్‌, భాస్కర్‌ బాల మద్ది, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గంధం మల్లేశ్వర్‌ రెడ్డి, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు రామాంజనేయులు, దళిత సమాఖ్య నాయకుడు గుర్రప్ప, మాల మహానాడు నాయకుడు చంటి ఓబయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. నందికొట్కూరు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసనమండలికి పంపించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి .ెంకటేశ్వర్లు ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని వాల్మీకి నగర్‌, వడ్డేపేట కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు ఉపేంద్ర నాయుడు, భాస్కర్‌ గౌడ్‌, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని ఎఐటియుసి నాయకులు కోరారు. భూమన శ్రీనివాస్‌ అధ్యక్షత జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడారు. నాయకులు సుంకయ్య, శివ బాలకృష్ణ, ప్రసాద్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.