పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి - ఆత్మకూరు
ఉద్యోగ, ఉపాధ్యాయ, సిపిఎస్ రద్దు కోసం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ కోసం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ కోసం, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం, పెన్షనర్స్ హక్కుల పరిరక్షణ కోసం, రాజకీయ, వికలాంగుల, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. యేసు రత్నం, డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు ఏ.రణధీర్, సిఐటియు పట్టణ కార్యదర్శి రాం నాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి షేక్ ఇస్మాయిల్, సిఐటియు పట్టణ నాయకులు నారాయణమూర్తి, గణపతిలు కోరారు. బుధవారం పట్టణంలోని వెంగల్ రెడ్డి నగర్ అర్బన్ కాలనీ అశోక్ నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని కురుకుంద కొట్టాల చెరువు, వడ్ల రామాపురం గ్రామాలలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహ నాయక్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, ఏపీ గిరిజన సంఘం డివిజన్ కార్యదర్శి శివ నాయక్, తదితరులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను గెలిపించాలన్నారు. కొత్తపల్లి : పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని పట్టభద్రులను, ఉద్యోగ ఉపాధ్యాయులను ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బొల్లు ప్రసాద్ యాదవ్ కోరారు. మండలంలోని వీరాపురం, గువ్వలకుంట్ల పాలెం, చెరువు, బండి నాయిని, పాలెం, తదితర గ్రామాల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు పట్టం కడితే శాసనమండలిలో సమస్యలను విస్మరించి అలంకారప్రాయంగా ఉంటారన్నారు. పాములపాడు : పోతుల నాగరాజును గెలిపించాలని పాములపాడు మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు సామన్న, వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పట్ల మాట్లాడే నాగరాజుకు ఓటు వేయాలని వారు కోరారు. ప్యాపిలి : ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని ప్రజా నాట్య మండలి జిల్లా కన్వీనర్ నాగరాజు, సీఐటీయూ నాయకులు నక్కి శ్రీకాంత్, డివైఎఫ్‌ఐ, ఎస్ ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విజరు, అశోక్, సునీల్ అన్నారు. జలదుర్గం, మాదవరం, రామక్రిష్ణ పురం, గార్లదిన్నె,అలెబాద్, అలెబాద్ తాండా, ముని మడుగు, రాచర్ల, బొంచెరువు పల్లె, నేరేడు చర్ల, సీతమ్మ తాండా, బూర్గల, కొమ్మమర్రి, సిద్దనగట్టు, గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. నందికొట్కూరు : సామాన్యులు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక అయితే ప్రజాస్వామ్యానికి మనగడం ఉంటుందని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం నాడు ఆయన హాస్పిటల్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ తాలూకా కార్యదర్శి సత్యనారాయణ, ఎక్స్రే డాక్టర్ నవీన్, నరేష్, మెడికల్ హెల్త్ కృష్ణమూర్తి, స్టాఫ్ నర్స్ శారద, వాచ్మెన్ సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు. బండి ఆత్మకూరు : మండలంలోని పార్నపల్లే గ్రామంలో డాక్టర్ పోతుల నాగరాజును గెలిపించాలని సిఐటియు జిల్లా నాయకుడు రత్నమయ్య, డివైఎఫ్‌ఐ నాయకుడు రాజేష్, వ్యకాసం నాయకులు డేవిడ్, సిఐటియు మండల నాయకుడు రాజు ప్రచారం చేశారు.










