పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు
ప్రజాశక్తి-సంతమాగులూరు: సామాన్య ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, వారి హక్కుల కోసం పోరాడే పిడిఎఫ్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన మీగడ వెంకటేశ్వరరెడ్డి, పి బాబురెడ్డిని గెలిపించాలని, శుక్రవారం సంతమాగులూరు లో ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఓటర్లను కలుసుకొని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు జి విజరుకుమార్ మాట్లాడుతూ, రాజకీయాల కతీతంగా పనిచేసే విజ్ఞానవంతులు, మేధావులు ఉండే ఈ సభలో పిడిఎఫ్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోతురాజు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.










