ప్రచారం నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు
ప్రజాశక్తి-సంతమాగులూరు : ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మండల పరిధిలోని పుట్టావారిపాలెం గ్రామంలో ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పల్నాడు జిల్లా నాయకుడు కె. హనుమంత రెడ్డి మాట్లాడుతూ శ్రమజీవుల, కష్టజీవుల గొంతుకను శాసనమండలిలో వినిపించడానికి పిడిఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పి బాబు రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. కార్మిక సమస్యలను గురించి మాట్లాడాలంటే పిడిఎఫ్ అభ్యర్థుల విజయం తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు, కొండలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.










