ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరిచిన ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పిడిఎఫ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డిని, ఉపాధ్యాయ అభ్యర్థి పి బాబురెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. శనివారం వారు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిడిఎఫ్ అభ్యర్థు లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. వారు మాట్లాడుతూ శాసనమండలిలో ప్రజా సమస్యల పరిష్కారానికి, శాసనమండలిలో నిరుద్యోగం, సిపిఎస్ రద్దు, విద్యా విధానం కాంటాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలపై పోరాడే సత్తా ఉన్న అభ్యర్థులు అని వారు తెలిపారు.










