Feb 18,2023 23:23

పిడిఎఫ్‌ అభ్యర్థి రమాప్రభను గెలిపించండి

ప్రజాశక్తి-గాజువాక : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ గాజువాక జోన్‌, 66వ వార్డు అజీమాబాదులో శనివారం ప్రజాసంఘాల నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి, ముద్రించిన కరపత్రాలను అంందించి, రమాప్రభకు ప్రధమ ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నేత ఎస్‌.అనిత, ఐద్వా అధ్యక్షులు కామేశ్వరి, కార్యదర్శి జి.లక్ష్మి, సిఐటియు నాయకులు ఎం.రాంబాబు, ఎం విజయరావు, ఎన్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.
అచ్యుతాపురం:250 ప్రజా సంఘాలు బలపర్చిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్‌ ఎం.రామ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. మండలంలోని హరిపాలెం గ్రామంలో ఉపాధ్యాయ సంఘ ప్రతినిధి ఎం.వెంకట అప్పారావు, సేజ్‌ నిర్వాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బుద్ధ రంగారావు తదితరులతో కలిసి శనివారం పట్టభద్రులను కలిశారు. పట్టభదల ఓట్లను రమాప్రభకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజా సంఘాలు యువకులు విద్యావంతులు ప్రతి ఒక్కరు రమాప్రభ గెలుపునకు కృషి చేసి సహకరించాలని కోరారు.