Feb 18,2023 18:02

ప్రచారం చేస్తున్న దృశ్యం

పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించండి : ప్రజా సంఘాలు

ప్రజాశక్తి - కొత్తపల్లి

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్‌ యాదవ్‌, కెవిపిఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి పాతకోట భాస్కర్‌, మాల మహానాడు మండల నాయకులు చంద్రబాబు మాట్లాడారు. పోతుల నాగరాజు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం ఉద్యమాలను నిర్మించారు. శాసనమండలిలో ప్రజల గొంతు వినిపించాలంటే పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విన్నవించు కున్నారు. మేధావులు ఉపాధ్యాయులు ఆలోచించి ప్రజా సమస్యలపై గళం విప్పి పరిష్కరించే నాయకున్ని ఎన్నుకోవాలన్నారు.