Feb 20,2023 21:41

పోతుల నాగరాజును గెలిపించాలని ఓటును అభ్యర్థిస్తున్న సిఐటియు జిల్లా నాయకులు రమేష్‌ కుమార్‌

పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించండి
సిఐటియు జిల్లా నాయకులు టి.రమేష్‌ కుమార్‌
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్దతుగా విస్తృత ప్రచారం
ప్రజాశక్తి - చాగలమర్రి

    పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిఐటియు జిల్లా నాయకులు రమేష్‌ కుమార్‌ పట్టభద్రులను కోరారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్‌ ఓటర్లను ఆయన కలిసి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులు, అధికారాలు, ఆత్మగౌరవం, సిపిఎస్‌ రద్దు, కాంటాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం, రాయలసీమ సమగ్ర అభివృద్ధి, రాజకీయాలలో విలువలు, సామాజిక న్యాయం కోసం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోతుల నాగరాజును గెలిపించాలని కోరారు. చదువుకున్న విద్యావంతులుగా ఓటును ఒక మంచి నాయకునికి వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామచంద్రుడు, మహబూబాషా, ఉపాధ్యాయ సంఘం నాయకులు మహమ్మద్‌ గౌస్‌, జాన్సన్‌, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. కొత్తపల్లి : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు, విద్యార్థి ఉద్యమ నాయకులు బొల్లు ప్రసాద్‌ బాబు యాదవ్‌ పట్టభద్రులను కోరారు. మండలంలోని ఎర్రమఠం, పాత మాడుగుల, ముసలమడుగు గ్రామాలలో పోతుల నాగరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి పోతుల నాగరాజును శాసన మండలికి పంపించేందుకు సహకరించాలని కోరారు. పాములపాడు : ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సామన్న, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, వ్యవసా కార్మిక సంఘం నాయకులు ఏసేపు, రజక సంఘం నాయకులు రామకృష్ణ కోరారు. ప్రైవేట్‌ పాఠశాల కరస్పాండెంట్‌ ఆర్‌ ఎస్‌ఆర్‌ గోపాల్‌, దేవికను, ఉపాధ్యాయులను, ప్రభుత్వ కార్యాలయంలో అధికారులను కలిసి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొలిమిగుండ్ల : ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకి మొదటి ఓటు వేసి గెలిపించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు పి దావీదు పట్టభద్రులను కోరారు. కొలిమిగుండ్లలోని స్థానిక సాయి చైతన్య స్కూల్‌లో ఆయన ఉపాధ్యాయులను కలిసి పోతుల నాగరాజును గెలిపించాలని కోరారు. పాణ్యం : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకి మద్దతుగా పాణ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య, సిఐటియు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం నిర్వహించి పోతుల నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ, సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్‌, సమాఖ్య నాయకులు రాజేష్‌, వాల్మీకి సంఘం నాయకులు మిద్దె వెంకట నాయుడు, రమణ, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. వెలుగోడు : పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజు గెలుపు కోసం కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామదాసు, సిఐటియు మండల అధ్యక్షులు వాదం నాగమోహన్‌, సిఐటియు నాయకులు షేక్‌ ఖాదర్‌ వలీ, బి రహంతుల్లా వెలుగోడు మండలంలో రేగడ గూడూరు, వేల్పనూరు గ్రామాల్లో హైస్కూలు, సచివాలయాలు, బ్యాంకులు, హాస్పిటల్లో కరపత్రాలు పంపిణీ చేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. బండి ఆత్మకూర్‌ : పోతుల నాగరాజును గెలిపించాలని కోరుతూ ప్రజాసంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ రత్నమయ్య వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డేవిడ్‌లు మండలంలోని ఏ కోడూరు, బండి ఆత్మకూరులోని జిల్లా పరిషత్‌ పాఠశాల, కస్తూరిబా పాఠశాల, మోడల్‌ హైస్కూల్‌లో విస్తృత ప్రచారం చేశారు. ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.