Feb 20,2023 16:37

ఓటును అభ్యర్థిస్తున్న సిఐటియు జిల్లా నాయకులు రమేష్ కుమార్

పిడిఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించండి
ప్రజాశక్తి - చాగలమర్రి

       పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిఐటియు జిల్లా నాయకులు రమేష్ కుమార్ కోరారు. సోమవారం ఆయన మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులు అధికారాలు ఆత్మగౌరవం కోసం, సిపిఎస్ రద్దు కోసం కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం కోసం, రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం రాజకీయాలలో విలువల కోసం సామాజిక న్యాయం కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోతుల నాగరాజును గెలిపించాలని కోరారు. చదువుకున్న విద్యావంతులుగా మన ఓటును ఒక మంచి నాయకునికి వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామచంద్రుడు ఈ మహబూబాషా ఉపాధ్యాయ సంఘం నాయకులు మహమ్మద్ గౌస్ జాన్సన్ ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.