ప్రజాశక్తి -అనకాపల్లి : ఉత్తరాంధ్ర సమస్యలపై సంపూర్ణ అవగాహన, ప్రజాసమస్యలపై పోరాడాలన్న సామాజిక స్పృహ, చొరవ, చిత్తశుద్ధి ఉన్న ఉత్తరాంధ్ర పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని డాక్టర్ కోరెడ్ల రమాప్రభను బలపరిచి, మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, జివిఎంసి 78వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బొడ్డు గంగారావు పిలుపునిచ్చారు. రమాప్రభను గెలిపించాలని కోరుతూ ఆదివారం పట్టణంలోని గాంధీనగరం, అంజయ్య కాలనీ, విజయరామరాజుపేట, శ్రీరామ్‌నగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ఇవ్వకుండా రాష్ట్రానికి కేంద్రం మోసగించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. దీనిపై రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ప్రశ్నించకపోగా, వంత పాడుతోందని, రూ.మూడు లక్షల కోట్ల విలువచేసే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రూ.30 వేల కోట్లకు అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నా పోరాడే దమ్ములేని పార్టీల అభ్యర్థులను గెలిపించే కన్నా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక హక్కుల కోసం, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పోరాడుతున్న రమాప్రభను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బి ఉమామహేశ్వరరావు, జంప రమేష్, శాస్త్రి, రంగబాబు, రమేష్, రాజేష్, దేవుడు నాయుడు, గంట శ్రీరామ్, ఎస్ రమణ, తరుణ్ పాల్గొన్నారు.
సిఐటియు, రైతుసంఘాల నేతల ప్రచారం
అచ్యుతాపురం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కె రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, మండల కార్యదర్శి కె. సోమునాయుడు తదితరులు కోరారు. ఆదివారం తిమ్మరాజుపేటలో పట్టభద్రుల ఓటర్లను కలిసి, పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభను బలపరచాలని అభ్యర్థించారు. తిమ్మరాజుపేట పిఎసిఎస్ సిఇఒ మహేశ్వరరావు కలిసి రమాప్రభకు ఓటేయాలని కోరారు.
ఎల్‌ఐసి ఉద్యోగుల ప్రచారం
కోటవురట్ల::ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ ఆదివారం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో నర్సీపట్నం ఎల్‌ఐసి యూనియన్ ప్రెసిడెంట్ వి చిననూకరాజు (చంటి) ప్రచారం నిర్వహించారు. సిపిఎస్ రద్దు, ఓపి ఎస్ పునరుద్ధరణ సహా కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులైజేషన్‌తో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు, తదితర సంఘాల సమస్యల పట్ల గళం విప్పే ఏకైక అభ్యర్థులు పిడిఎఫ్ ఎమ్మెల్సీ లేనని తెలిపారు. రమాప్రభను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు,పాల్గొన్నారు.
గాజువాక : పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ గెలుపును కోరుతూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన ఆదివారం మింది గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును రమాప్రభకు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో లోకేష్, డి.అప్పారావు, ఏటి గోపాలరావు, వర్రీ వెంకటరావు, వనమాడ అప్పలరాజు, రాంబాబు పాల్గొన్నారు.
మిందిలో ప్రజా సంఘం నాయకుల పచారం
ములగాడ : 58వ వార్డు పరిధి గుల్లలపాలెం, శ్రీనివాసనగర్, రాంనగర్, కుంచమ్మ కాలనీ, 59వ వార్డు పరిధి ములగాడ హౌసింగ్ బోర్డు కాలనీ, గణపతి నగర్, హిమాచల్‌నగర్, శాంతిగిరి కాలనీ, 60వ వార్డు ఎంఐజి కాలనీ, 61వ వార్డు పరిధి మల్కాపురం పల్లెవీధి, గొల్లవీధి గాంధీజీ వీధి, హరిజన వీధి, శెట్టిబలిజ వీధిలో పట్టభద్రుల ఓట్లర్లను ప్రజాసంఘాల నాయకులు కలిశారు. విద్యావంతులు, సామాజిక కార్యకర్త డాక్టర్ రమాప్రభకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రలోభాలకు, డబ్బులకు లొంగకుండా నీతివంతులను గెలిపించుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ ప్రచారంలో ఐద్వా మల్కాపురం జోన్ అద్యక్ష, కార్యదర్శులు బి.మమత ఆర్.విమల, సభ్యులు ఉమ, విజయ, కృష్ణవేణి, నిర్మల, తిరుమల, డివైఎఫ్‌ఐ నాయుకులు రాజేష్, మోహన్, సుభానీ, సురేష్, రాజు, శ్రీను, రాంబాబు, ఈశ్వరరావు, వెంకట్, కుమార్, ప్రశాంత్, సిఐటియు నాయుకులు కె.పెంటారావు, వై.గంగాధర్, పివి.భాస్కర్, పెన్షనర్ల సంఘం నాయకులు కె.నూకరాజు, ఆర్.దేవరాజు, తాతాజీ, నర్సింగరావు, హుస్స్, జానీ తదితర్లు పాల్గొన్నారు.
భీమునిపట్నం : సిఐటియు భీమిలి జోన్ నాయకులు రవ్వ నరసింగరావు ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి కరపత్రాలను అందించారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి రమాప్రభను గెలిపించాలని అభ్యర్థించారు.










