
ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో ఏకైక మేజర్ పంచాయతీ ఏఎల్‌పురం గ్రామంలో శని, ఆదివారాల్లో 31 మంది కుక్కకాటుకు గురయ్యారు.గ్రామంలో పిచ్చికుక్కల స్వైర విహారం చేసి పలువురుని రెండు రోజులు గాయపరిచాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు. ఆదివారం ఉదయం కొంతమంది చిన్నారులను పిచ్చికుక్కలు గాయపరచడంతో తప్పని పరిస్థితుల్లో యువకులు కలిసి ఒక పిచ్చి కుక్కని వెంటాడి హత మార్చారు. ఆ సమయంలో యువకుల సైతం కుక్కకాటుకు గురి కావాల్సి వచ్చింది. గ్రామంలో సుమారు 60 మంది వరకు రెండు రోజుల్లో పిచ్చి కుక్కలు గాయపరిచాయని బాధితులు తెలిపారు. పంచాయతీలో కుక్కల విచ్చలవిడిగా సంచరిస్తూ పలువురిని గాయాలుపాలు చేస్తున్నాయని వాటిని నిరోధించాలని పంచాయతీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లప్పటికి ఏ విధమైన చర్యలు చేపట్టలేదని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు కుక్కలను అదుపు చేసి ప్రజలను రక్షించాలని పలువురు కోరారు.