Oct 08,2023 21:33

పిచ్చికుక్క దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : పిచ్చికుక్క దాడి చేయడంతో ఆరుగురు వ్యక్తులు గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. జియమ్మవలస మండలం తురకనాయుడువలసలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి గ్రామానికి చెందిన గుణుపూరు గోవిందనాయుడు, మరడ శంకరరావు, తామాడ శ్రీనివాసరావు, వాకాడ స్వామినాయుడు, బీమారాపు శ్రీనివాసరావు, పళ్ల సత్యంను గాయపరిచింది. ముఖం, ఒంటిపై స్వల్ప గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని వైద్యం కోసం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్యం అందించారు.