ప్రజాశక్తి - విశాఖ సిటీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పిఆర్‌సిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగ సంఘాలు ఆందోళనబాటపట్టాయి. శనివారం ఉదయం పిఆర్‌సికి వ్యతిరేకంగా మెడికల్ అండ హెల్త్ వర్కర్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అలాగే అఖిలపక్షం ఆధ్వర్యంలో జివిఎంసి దగ్గర ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహారదీక్షలనుద్దేశించి రెవెన్యూ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు వి. వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు నష్టం చేకూరేలా ఉన్న పిఆర్‌సిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.













