Feb 08,2022 12:09

విశాఖ : పిఆర్‌సి పై ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరాటాన్ని బలపరచాలంటూ ... సిపిఎం విడుదల చేసిన పోస్టర్‌ను మంగళవారం సిపిఎం నేతలు ఆవిష్కరించారు. పిఆర్‌సి జిఒ ను రద్దు చేయాలని కోరుతూ.. నేతలు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, 78 వ వార్డు కార్పొరేటర్‌ బి.గంగారావు, ఆర్‌ కెఎస్‌ వి.కుమార్‌, బి.ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.