Sep 03,2022 23:29

డ్రెయినేజీపై పగిలి ఉన్న పలకలు

ప్రజాశక్తి -మధురవాడ : జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సర్వీస్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న కాలువపై పలకలు పగిలిపోవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమ్మాది కూడలి నుంచి పిఎం.పాలెం క్రికెట్‌ స్టేడియం వరకు సర్వీస్‌ రోడ్లకు ఇరువైపులా కాలువలు ఉన్నాయి. కాలువలు నిర్మాణ సమయంలో వాటిపై పలకలను ఏర్పాటుచేశారు. ఆ పలకు పలుచోట్ల విరిగిపోవడంతో అటుగా ప్రయాణించే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై ప్రయాణం చేసేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై స్థానికులు పలుమార్లు జివిఎంసి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కాలువపై పలకలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.