Feb 23,2023 23:52

తనిఖీలు చేపడుతున్న మిశ్రా

ప్రజాశక్తి-హుకుంపేట: ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేసిన బంక్‌ నుండి పెట్రోల్‌, డీజిల్‌ పక్కదారి పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పదని విశాఖ ఉమ్మడి జిల్లా సేల్స్‌ ఆఫీసర్‌ ఎస్‌.మిశ్రా తెలిపారు. గురువారం మండల కేంద్రంలో పెట్రోల్‌ బంక్‌ను తనిఖీ చేశారు. పెట్రోల్‌, డీజీల్‌ నాణ్యతను పరిశీలించారు. స్టాక్‌ రికార్డులు పరిశీలించారు. హెయిర్‌ మిషన్‌ ఏర్పాటు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మండల కేంద్రంలోనే పలు దుఖణాల వద్ద పెట్రోల్‌, డిజీల్‌ అమ్మకాలు లేకుండా చేస్తే జిసిసి బంకుకు మరింత ఆదాయం వస్తుందని తెలిపారు. .ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రాజ్యలక్ష్మి, ఆర్‌ఐ రంగారావు పాల్గొన్నారు.