Dec 22,2022 00:11

పెట్రోల్‌ బంకును ప్రారంభిస్తున్న జిసిసి చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి

ప్రజాశక్తి - అడ్డతీగల
మండల కేంద్రంలో పెట్రోల్‌ బంకు బుధవారం పున:ప్రారంభమైంది. గత కొన్ని సంవత్సరాలుగా జిసిసి ఆధ్వర్యాన నిర్వహించిన ఈ బంకు సంవత్సర కాలంగా నిలిచిపోయింది. దీంతో గిరిజన సహకార సంస్థ వారు ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ వారికి లీజుకు ఇవ్వడంతో వారు సుమారు రూ.2.20 కోట్లతో పునరుద్ధరించారు. ఈ పెట్రోల్‌ బంకును జిసిసి చైర్‌పర్సన్‌ శోభ స్వాతి రాణి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతిరాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో పెట్రోల్‌, డీజిల్‌ను అధిక ధరలకు అమ్ముతున్నారని తెలియడంతో వెంటనే అడ్డతీగల, రంపచోడవరంలో పెట్రోల్‌ బంకులను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిసిసి జనరల్‌ మేనేజర్‌ జె.యుస్టస్‌, డివిజనల్‌ మేనేజర్‌ పార్వతీశ్వరరావు, అడ్డతీగల మేనేజర్‌ చంద్రశేఖర రావు, మారేడుమిల్లి మేనేజర్‌ రాజా రెడ్డి, గోడౌన్‌ సూపరింటెండెంట్‌ బాబురావు పాల్గొన్నారు.
రంపచోడవరం : మండలంలోని ఇర్లపల్లి జిసిసి ద్వారా నిర్వహిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ బంకును జిసిసి చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి, రంపచోడవరం శాసన సభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి
బుధవారం పున:ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శబంధం శ్రీదేవి, జడ్పిటిసి పండ వెంకటలక్ష్మి, వైస్‌ ఎంపీపీలు కె.బాలకృష్ణ, పండ కుమారి, లక్ష్మి, సర్పంచులు చదల శ్రీదేవి, కుంజం వెంకటలక్ష్మి, ప్రజా ప్రతినిధులు కర్రి పాపారాయుడు, జల్లేపల్లి రామన్న దొర, జిసిసి సీనియర్‌ మేనేజర్లు ఎంఎన్‌,రాజారెడ్డి. విజయలక్ష్మి, జి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.