Jun 08,2023 23:52

పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి -అనంతగిరి
పాడేరు ఐటిడిఏ సాయంతో ఏర్పాటు చేసిన హిందుస్థాన్‌ పెట్రోల్‌ బంక్‌ను జిల్లా కలెక్టర్‌. సుమిత్‌ కుమార్‌, ఐటీడీఏ పిఒ, అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గొట్టేటి. మాధవి, శాసన సభ్యులు శెట్టి పాల్గుణ, ఉమ్మడి జిల్లా చైర్పర్సన్‌ సుభద్ర ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, వాహన వినియోగదారులతో మర్యాద పూర్వకంగా మెలగాలన్నారు. బంక్‌ అందుబాటులోకి రావడంతో ఇటు స్థానిక ప్రజలకు, పర్యాటకులకు సౌకర్యార్థంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి దీసరి. గంగరాజు, ఎంపీపీ శెట్టి .నీలవేణి, స్థానిక సర్పంచ్‌ సోమ్మెల. రూతు, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌. మదీనా, తహశీసిల్దార్‌ .రాంభాయి, ఇన్‌ చార్జి ఎంపీడీవో ఏవివి .కుమార్‌ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌, పిఒలకు సిపిఎం వినతి
మండలంలోని నెలకొన్న పలు సమస్యలపై కలెక్టర్‌,. ఐటీడీఏ పిఒ, ఎమ్మెల్యే లకు లిఖిత పూర్వకంగా విన్నవించారు.స్థానిక జెడ్పిటిసి దీసరి .గంగరాజు, సర్పంచ్‌ సోమ్మెల .రూతు, సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.నాగులు కలిసి లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, రొంపల్లి పంచాయతీ పరిధి బూరిగ, చిన్నకోనెల గ్రామాలలో గిరిజన రైతుల సాగు భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు.తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు. బీంపొలు పంచాయతీ పరిధి నందకోట రెవెన్యూ చిమ్మిడిపల్లి గ్రామంలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. గ్రామ కంఠ భూమితో పాటు రైతులు సాగులో ఉన్న భూమి కూడా భూస్వామి ఆధీనంలో ఉందన్నారు. గ్రామాన్ని ఖాళీ చేయాలని గిరిజనులను భూస్వామి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.కలెక్టర్‌ స్పందిస్తూ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు గంగరాజు తెలిపరు.సర్పంచ్‌. రూతు మాట్లాడుతూ, అనంతగిరి పంచాయతీ పరిధి లక్ష్మీపురం నుండి రాజుపాక గ్రామం వరకు, అనంతగిరి, పెద్దూరు నుండి పాతకోట, రేగం. లక్ష్మీపురం గ్రామాలకు చెక్‌ డ్యామ్‌లు మంజూరు చేయాలని కోరారు