పోటీలను ప్రారంభిస్తున్న చౌడువాడ సర్పంచ్ ఎరుకునాయుడు
ప్రజాశక్తి - కె.కోటపాడు
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగను పురస్కరించుకొని మండలంలోని చౌడువాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ కప్ క్రికెట్ టోర్నమెంటును ఆ గ్రామ సర్పంచి దాడి ఎరుకు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనపరచాలన్నారు. క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. యువత పెడతారి పట్టకుండా ఖాళీ సమయంలో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఆటలు ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో మారపు రెడ్డి శివ, ద్ణుఖ గంగరాజు, అనకాపల్లి ప్రశాంత్, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన యువకులు పాల్గొన్నారు.










