Jun 20,2023 19:21

కరపత్రాలు ఇచ్చి ప్రచారం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పెరిగిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గసభ్యులు తిప్పన్న, నాయకులు కృష్ణమూర్తి, అజీం ఖాన్‌, గోవిందు, ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో షాప్‌ టు షాప్‌, మున్సిపల్‌ మెయిన్‌ రోడ్డులో ఉన్న కరెంట్‌ బిల్లు చెల్లింపు కేంద్రం వద్ద ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సర్దుబాటు చార్జీల విధానం రద్దు చేయాలని, ట్రూ అప్‌ సర్దుబాటు చార్జీలను నిలిపివేయాలని, స్మార్ట్‌ మీటర్లు పెట్టరాదని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ఆదోని(రూరల్‌) మండలంలోని పాండవగల్‌ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న మాట్లాడారు. ఈ మధ్యనే వామపక్షాల ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగిందని, 10 వామపక్ష పార్టీలు కలిసి ఈనెల 30న విద్యుత్‌ కార్యాలయాల దగ్గర ఆందోళనకు పిలిపిచ్చాయని తెలిపారు. సిపిఎం శాఖ కార్యదర్శి కె.పాండురంగ పాల్గొన్నారు.