Sep 07,2023 22:53

ప్రచారంలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు కె హనుమంత్‌రెడ్డి

ప్రజాశక్తి-ఈపూరు : బిజెపి పాలనలో పెరిగిన ధరలతో పేదల జీవనం భారంగా మారిందని సిపిఎం నాయకులు కె.హనుమంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమరభేరిలో భాగంగా మండల కేంద్రమైన ఈపూరులో గురువారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హనుమంతురెడ్డి మాట్లా డుతూ కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసం జనంపై కేంద్ర ప్రభుత్వం భారాలు మోపు తోందని, అదే విధానాలను రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వమూ అమలు చేస్తోందని మండిపడ్డారు. జగన్‌ పాలనలో ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. వ్యవసా యానికి విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేస్తు న్నారని, ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లు పెడతామ ంటున్నారని విమర్శించారు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అని చెప్పి ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెడుతు న్నారన్నారు. సామాన్యులు కొనలేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరి గాయని, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ విద్యుత్‌ చార్జీలు రోజు రోజుకి పెరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. నిరుద్యోగం పెరిగిందని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీ ర్యం చేస్తున్నారని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో సిపిఎం నాయకులు కె శివరామ కృష్ణ, షేక్‌ మస్తాన్‌బి, ఎం.దేవసహాయం, దేవతి, మెహర్‌, స్వరాజ్‌ పాల్గొన్నారు.