May 06,2023 00:24

సమావేశంలో మాట్లాడుతున్న పెన్షనర్ల నాయకులు

ప్రజాశక్తి -గాజువాక : ఇపిఎస్‌- 95 పెన్షనర్స్‌ సమస్య పరిష్కరించాలని కోరుతూ పోస్టుకార్డు ఉద్యమాన్ని పెదగంట్యాడ సిడబ్ల్యూసిలో శుక్రవారం ఆల్‌ రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు దీనబందు, ప్రధాన కార్యదర్శి హుస్సేన్‌ మాట్లాడుతూ, కనీస పెన్షన్‌ రూ.9000, దానికనుగుణంగా డిఎ ఇవ్వాలని, మెడికల్‌ సౌకర్యం, రేషన్‌కార్డులు కల్పించాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రికి డిమాండ్లతో కూడిన పోస్ట్‌ కార్డులను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్‌ పెదగంట్యాడ అధ్యక్షులు కణితి అప్పలరాజు, ఎన్‌.అప్పలనాయుడు, గంట్యాడ పైడిరాజు, బైరెడ్డి గురప్ప, పాల వెంకయ్య, నాగిరెడ్డి అప్పలనాయుడు, ఎన్‌వి.రమణ, జి.దుర్గారావు, నమ్మి అప్పారావు, సోమినాయుడు పాల్గొన్నారు.