.ఎమ్మెల్యేను సన్మానిస్తున్న ప్రభుత్వ పెన్షనర్లు
రాయచోటి టౌన్ : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చర్చించారు. ఆదివారం పట్టణంలోని వైఎస్‌ఆర్ సిపి కార్యాలయంలో ఆయన్ను నియోజక వర్గ పరిధిలోని పెన్షనర్ల సంఘ నాయకులు కలిశారు. వివిధ సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే వివరించారు. పట్టణ అభివద్ధి కోసం మీరు చేస్తున్న కషి అభినందనీయమంటూ ఎమ్మెలేను పెన్షనర్ల సంఘ నాయకులు సత్కరించారు.
కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు చెంగల్ రెడ్డి, గౌరవాధ్యక్షుడు రమణ,అసోసియేట్ అధ్యక్షుడు పి చిన్నరెడ్డేన్న, కార్యదర్శి ఈశ్వరయ్య, వారాది రెడ్డి, గురవయ్య, వెంకట రమణ పాల్గొన్నారు










