ఫొటో : లబ్ధిదారులకు పెన్షన్‌లు పంపిణీ చేసిన సర్పంచ్
పెన్షన్‌లు పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి : నూతనంగా మంజూరైన వైఎస్‌ఆర్ పెన్షన్‌లను సర్పంచ్ ముట్టుకొందు లక్ష్మీనారాయణమ్మ పంపిణీ చేశారు. సోమవారం మండల పరిధిలోని ఆర్లపడియ పంచాయతీలో నూతనంగా 14 పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్ పెన్షన్ వలస గ్రామాల వృద్ధులకు వికలాంగులకు ఓ మంచి వరమన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్‌దారుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. అందులో భాగంగా పంచాయతీలో ఒంటరి మహిళలకు 7, వికలాంగులకు 3, వృద్ధుల పెషన్‌లను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ దిలీప్, వెల్ఫేర్ అసిస్టెంట్ నాగేంద్ర, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.










